ISRO is launching a satellite made by a student of Mohan Babu University : మంచు విష్ణు కీలక ప్రకటన చేశారు. తమకు చెందిన మోహన్ బాబు యూనివర్శిటీకి చెందిన విద్యార్థి ఒకరు శాటిలైట్ తయారు చేశారని దాన్ని ఇస్రో సాయంతో శనివారమే నింగిలోకి లాంచ్ చేస్తున్నామని ప్రకటించారు. ఇందు కోసం నేషనల్ అట్మోస్ఫరిక్ రీసెర్చ్ లేబోరేటరీ సాయం చేసిందన్నారు. అయితే ఎప్పుడు ఎక్కడ ఎలా లాంచ్ చేస్తారు.. దాన్ని ఎవరైనా చూడవచ్చా.. ఆ శాటిలైట్ ఎలాంటి పనితీరు చూపిస్తుంది.. అనే అంశాలపై మిగతా వివరాలు వెల్లడించలేదు.